బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని నెల గడిచిపోయింది. తాజాగా ఇతడి మరణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రాజ్‌పుత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే. సుశాంత్‌ది సూసైడ్ చేసుకునే స్వభావం కాదని వెల్లడించింది.
"నాకు తెలిసినంత వరకు సుశాంత్ డిప్రెషన్‌తో బాధపడలేదు. అతడి లాంటి వ్యక్తిని నేను చూడలేదు. అతడు తన కలల్ని ఓ డైరీలో రాసుకునేవాడు. తానేం చేయాలో, ఎలా ఉండాలో అనే కొన్ని విషయాలపై ఒక ఐదేళ్ల భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకున్నాడు. అలాగే వాటిని సాధించాడు. కానీ సుశాంత్ డిప్రెషన్లో ఉన్నాడని అంటున్నారు. అది చాలా బాధగా ఉంది. కొన్నిసార్లు నిరాశ చెందేవాడు. ఒత్తిడికి గురయ్యేవాడు. కానీ డిప్రెషన్ అనేది చాలా పెద్ద పదం." అంటూ చెప్పుకొచ్చింది అంకిత.