సుశాంత్ ఆత్మహత్య విషయమై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ హీరో తండ్రి కేకే సింగ్ బిహార్ పోలీస్ స్టేషన్లో రియా చక్రవర్తిపై కేసు నమోదు చేశారు. సుశాంత్ చనిపోవడానికి ఆమె కారణమంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ముంబయి పోలీసుల నుంచి కేసు విషయమై సమాచారం సేకరించడంలో నిమగ్నమయ్యారు పట్నా పోలీసులు. అయితే సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే కూడా పలు కీలక విషయాలను వారితో పంచుకున్నట్లు సమాచారం.
రియా చక్రవర్తి తనను వేధిస్తున్నట్లు సుశాంత్ అప్పట్లో అంకితతో చెప్పాడట. అలాగే రియాతో రిలేషన్ షిప్ ఇక తన వల్ల కాదని తామిద్దరం విడిపోదామనుకుంటున్నట్లు కూడా వెల్లడించాడట. ఈ విషయాల్ని అంకిత.. సుశాంత్ కుటుంబంతో పాటు పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది.