బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో.. ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా మనీ లాండరింగ్ కేసు కింద సుశాంత్ చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) సందీప్ శ్రీధర్‌ను ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). గతేడాది నుంచి సుశాంత్ ఆర్థిక లావాదేవీలను సందీప్ చూసుకుంటున్నాడు.
సుశాంత్ అకౌంటెంట్‌ను ప్రశ్నించిన ఈడీ - ed questions sushants ca
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ రాజ్‌పుత్ చార్టర్డ్ అకౌంటెంట్ అయిన సందీప్ శ్రీధర్‌ను ఈడీ ప్రశ్నించింది. ఇటీవలే నటుడి తండ్రి ఫిర్యాదు మేరకు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సుశాంత్
మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద శ్రీధర్ వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు అధికారులు తెలిపారు.
సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేరకు.. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి సహా ఆరుగురిపై బిహర్‌లోని రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు మరో ఖాతాకు తరలించారని ఆరోపణలు చేశారు కేేకే సింగ్. ఈ క్రమంలోనే ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
Last Updated : Aug 3, 2020, 9:54 PM IST