బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయమై, పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సుసైడ్ నోట్ దొరకకపోవడం వల్ల అతడు చనిపోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని గురువారం దాదాపు తొమ్మిది గంటలపాటు విచారించారు. ఈ నటుడితో యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ చేసుకున్న కాంట్రాక్టుల జాబితాను చూపించాలని కోరుతూ పోలీసులు వారికి ఓ లేఖ రాశారు.
తొమ్మిది గంటలపాటు రియా విచారణ
సుశాంత్ మృతిపట్ల అనుమానం వ్యక్తం చేసిన బాంద్రా పోలీసులు.. అతడి ప్రేయసి రియా చక్రవర్తిని తొలుత విచారణకు పిలిచారు. గురువారం, తొమ్మిది గంటలపాటు ఆమెను పలు ప్రశ్నలు అడిగారు. ఫోన్లో సుశాంత్‌తో రియా జరిపిన సంభాషణలతో పాటు ఫొటోలు, వీడియోలు పరిశీలించారు.
ప్రేయసి రియా చక్రవర్తితో సుశాంత్ సింగ్(పాత చిత్రం) ఈ సందర్భంగా రియా.. తామిద్దరం ఆస్తిని కొనుగోలు చేయాలనుకున్నామని, ఈ ఏడాది చివర్లో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నట్లు పోలీసులకు చెప్పింది. అతడితో బ్రేకప్ చేసుకోలేదని, ఫోన్‌కాల్స్ ద్వారా ఇద్దరం మాట్లాడుకునే వాళ్లమని వెల్లడించింది.
గత కొన్నాళ్లుగా సుశాంత్ మానసికి పరిస్థితి బాగోలేదని చెప్పిన రియా.. అయినా సరే మందులు తీసుకునేందుకు ఇష్టపడేవాడు కాదని తెలిపింది. సుశాంత్ ఆరోగ్యం గురించి అతడి సోదరికి చెప్పి, అతడితో కలిసి ఉండమని ఆమెకు చెప్పినట్లు వివరణ ఇచ్చింది.
యశ్‌రాజ్ నిర్మాణ సంస్థకు లేఖ
సుశాంత్ చనిపోవడానికి వృత్తిపరమైన కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాపు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు నిర్మాణ సంస్థలను విచారిస్తున్నారు. అందులో భాగంగా యశ్‌రాజ్ ఫిల్మ్స్, సుశాంత్‌తో చేసుకున్న కాంట్రాక్టుల జాబితాల పరిశీలించాలని కోరుతూ వారికి లేఖ రాశారు. అందుకు సంబంధించిన కాపీలను ఇవ్వాలని అడిగారు. రానున్న కొన్నిరోజుల్లో ఈ కాంట్రాక్టులతో సంబంధమున్న అందరిని పోలీసులు ప్రశ్నించనున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్-యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ సుశాంత్ సింగ్ గతంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో శుద్ధ్ దేశీ రొమాన్స్(2013), బ్యొమ్కేస్ బక్సీ(2015) సినిమాలు చేశాడు. మూడో చిత్రంగా 'పానీ' చేయాల్సినా, పలు కారణాలతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది ఈ నిర్మాణ సంస్థ.
ఇవీ చదవండి: