బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఊహించని మలుపులు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నటుడి కేసుకు సంబంధించి విచారణ ముమ్మరం చేసింది. తాజాగా మనీ ల్యాండరింగ్ కేసులో భాగంగా రాజ్‌పుత్ సిబ్బందిని ప్రశ్నించింది. ప్రధానంగా సుశాంత్ ఇంట్లో జరిగే కార్యకలాపాలపై దర్యాప్తు చేసింది. ఈరోజు రియా చక్రవర్తిని కూడా ప్రశ్నించింది.
సుశాంత్ కేసులో ఈడీ విచారణ..
- బిహార్‌లో తనపై నమోదైన కేసును ముంబయికి బదిలీ చేయాలని ఇటీవలే రియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిగే వరకు తన స్టేట్మెంట్ రికార్డ్‌ను వాయిదా వేయాలని ఈడీని రియా అభ్యర్థించింది. కానీ, తప్పనిసరిగా ఈడీ ముందు రియా చక్రవర్తి హాజరుకావాల్సి వచ్చింది.
- రియాతో పాటు ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి కూడా శుక్రవారం రెండు సార్లు ఈడీ కార్యాలయానికి వచ్చాడు.
- మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి సుశాంత్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీని ఈడీ విచారించింది.
- రియా చక్రవర్తిని దాదాపు 8 గంటల పాటు విచారించింది ఈడీ. మధ్యాహ్నం ఆఫీస్‌కు చేరుకున్న రియాను రాత్రి 8.30 గంటల వరకు ప్రశ్నించింది.
- రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి, సీఏ రితేష్ షా, బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీలను కూడా ప్రశ్నించింది. అయితే మరలా ఈ నెల 10న ఈడీ ముందు హాజరు కావాలని రియాకు ఆదేశించింది.
- సుశాంత్, రియాలు సహజీవనం చేసినప్పటి కాలంలో లావాదేవీలపై రియాను ఈడీ ప్రశ్నించింది.
- రియా లావాదేవీల విషయంలో కొన్ని అనుమానాలున్నట్లు.. వాటిపై తమకు క్లారిటీ ఇవ్వాలని రియాను కోరినట్లు సమాచారం.
- అలాగే సుశాంత్ స్నేహితుడు, రూమ్మేట్ సిద్దార్థ్ పితాని శనివారం ఈడీ ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.
- రియా చక్రవర్తి నిర్దోషి అయితే దర్యాప్తు నుంచి పారిపోవాలని ఎందుకు చూస్తోందని రాజ్‌పుత్ బంధువు, భాజపా ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్ ప్రశ్నించారు.
- నటుడి కేసుపై నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు తప్పించుకోకూడదని నీరజ్ కోరారు.
- సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయడంపై వచ్చిన పిటిషన్లపై ముంబయి హై కోర్టు స్పందిస్తూ.. అలా చేయడం కుదరదని స్పష్టం చేసింది.
- సీబీఐ విచారణ కోరుతూ కొంతమంది లా స్టూడెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో వారికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.