బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని ఇటీవలే మరణించాడు. అయితే అతడి మృతికి బాలీవుడ్లోని కొందరు పెద్దలే కారణమని, బిహార్ న్యాయస్థానంలో న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా పిటిషన్ వేశారు. తాజాగా దానిని కొట్టేసిన కోర్టు.. ఈ విషయం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.
ఈ విషయమై స్పందించిన ఓజా.. తాను జిల్లా కోర్టులో సుశాంత్ కేసును సవాలు చేస్తానని చెప్పారు. అతడికి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తానని అన్నారు.