తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్​ కేసు: ఈడీ ఎదుట హాజరైన శ్రుతి, సిద్దార్థ్​ - ed to question sushant sister

సుశాంత్​ కేసు విచారణలో భాగంగా శ్రుతి మోదీ, సిద్దార్థ్​ పిథాని మంగళవారం ఈడీ ముందు హాజరయ్యారు. సుశాంత్​ సోదరి మీతూ సింగ్​ కూడా కార్యాలయానికి చేరుకుంది.

Sushant Singh Rajput case
సుశాంత్​ కేసు

By

Published : Aug 11, 2020, 3:01 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్ సింగ్​ కేసు విచారణ నిమిత్తం అతని మాజీ బిజినెస్​ మేనేజర్​ శ్రుతి మోదీ మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యింది. రాజ్​పుత్​ స్నేహితుడు సిద్దార్థ్​ పిథాని కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. ఉదయం 9.30 గంటలకు మోదీ రాగా.. మధ్యాహ్నం సుశాంత్​ సోదరి మితూ సింగ్​ హాజరైంది. ఇప్పటికే సుశాంత్​ కేసు విచారణలో భాగంగా సోమవారం నటి రియా చక్రవర్తి ఆమె కుటుంబసభ్యులను ఈడీ అధికారులు ప్రశ్నించారు. శ్రుతిని కూడా విచారించారు.

రియా కుటుంబ సభ్యులతో పాటు కేసుతో సంబంధమున్న వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇక పట్నాలో తనపై నమోదైన కేసును ముంబయికి బదిలీ చేయాలని కోరుతూ రియా దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీం కోర్టు ఈరోజు(మంగళవారం) విచారించనుంది.

ABOUT THE AUTHOR

...view details