తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సోమవారం మరోసారి రియాను ప్రశ్నించనున్న ఎన్​సీబీ - సుశాంత్ ఆత్మహత్య కేసు రియా చక్రవ్తి

సుశాంత్ సింగ్ రాజ్​పుత్ కేసులో నటి రియా చక్రవర్తిని విచారిస్తోంది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఈరోజు విచారణ ముగిసినట్లు.. మళ్లీ సోమవారం రియాను ప్రశ్నించనున్నట్లు తెలిపారు అధికారులు.

రేపు మరోసారి ఎన్​సీబీ ఆఫీస్​కు రియా!
రేపు మరోసారి ఎన్​సీబీ ఆఫీస్​కు రియా!

By

Published : Sep 6, 2020, 7:15 PM IST

యువ కథానాయకుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో నటి రియా చక్రవర్తి కుటుంబానికి ఉచ్చు బిగుస్తోంది. మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ముందుకు ఆమె హాజరైంది. అయితే ఈ రోజుకు విచారణ ముగిసినట్లు ఎన్​సీబీ అధికారులు తెలిపారు. దాదాపు ఆరు గంటల పాటు విచారణ కొనసాగింది. అయితే సోమవారం కూడా రియాను ప్రశ్నించనున్నట్లు ఎన్​సీబీ తెలిపింది.

సుశాంత్ మేనేజర్‌ శామ్యూల్‌ మిరండాతోపాటు రియా సోదరుడు షౌవిక్‌ చక్రవర్తి సెప్టెంబర్‌ 9వ తేదీ వరకు ఎన్‌సీబీ కస్టడీలోనే ఉండేలా శనివారం కోర్టు తీర్పు వెల్లడించింది. విచారణలో భాగంగా షౌవిక్‌ డ్రగ్స్‌తో సంబంధమున్న పలువురి పేర్లు వెల్లడించినట్లు ఎన్‌సీబీ అధికారులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details