బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. తాజాగా నటుడి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రియా చక్రవర్తి సోదరుడు షోయిక్ చక్రవర్తిని రెండోసారి అధికారులు విచారించారు.
శనివారం మధ్యాహ్నం ఈడీ కార్యాలయానికి వెళ్లిన షోయిక్.. దాదాపు 18 గంటల తర్వాత ఆదివారం ఉదయం 7గంటలకు బయటకు వచ్చాడు. అయితే ఈడీ ప్రశ్నలకు షోయిక్ సరైన సమాధానలు చెప్పడం లేదని అధికారులు తెలిపారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే సోమవారం మళ్లీ పిలిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.