తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్​ కేసులో రంగంలోకి సీబీఐ.. దర్యాప్తు ఇలా! - సుశాంత్​ కేసులో ముంబయికి సీబీఐ

బాలీవుడ్​ నటుడు సుశాంత్ రాజ్​పుత్​ కేసును ఛేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఆగస్టు 20(ఇవాళ) సాయంత్రం ముంబయికి చేరుకోనున్నారు సీబీఐ అధికారులు. అనంతరం ముంబయి పోలీసుల నుంచి కేసు వివరాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించనున్నారు.

Sushant Singh Rajput case
సుశాంత్​ కేసులో ముంబయికి సీబీఐ

By

Published : Aug 20, 2020, 4:16 PM IST

సుప్రీంకోర్టు గ్రీన్​సిగ్నల్​తో బాలీవుడ్​ నటుడు సుశాంత్​ కేసును దర్యాప్తు చేయడానికి.. ఆగస్టు 20(నేడు) సాయంత్రం ముంబయికి చేరుకోనుంది సీబీఐ. సూపరింటెండెంట్​ ఆఫ్​ పోలీస్​ నుపుర్​ ప్రసాద్​ నేతృత్వంలోని అధికారుల బృందం.. తమ కరోనా పరీక్షల రిపోర్టుతో నగరానికి చేరుకుంటారు. ఈ మేరకు సమాచారాన్ని అధికార వర్గాలు తెలిపాయి.

సుశాంత్​ కేసులో ముంబయికి సీబీఐ

కేసు వివరాల సేకరణతో ప్రారంభించి

అనంతరం ముంబయి పోలీసుల నుంచి సుశాంత్​ కేసు వివరాలతో కూడిన ఫైల్​ను సేకరిస్తారు. ఆ ఫైల్​ను స్టడీ చేసిన తర్వాత ఈ కేసును మొదటి నుంచి దర్యాప్తు చేయాలా? లేదంటే వారు సేకరించిన వివరాలతో ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తారు. నటుడు ఆత్మహత్యకు పాల్పడిన నివాస ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత అతడి సోదరి నీతూ సింగ్​ను కలిసి నటుడుకు సంబంధించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుంటారు.

సుశాంత్​ తండ్రి కేకే సింగ్ అభ్య‌ర్థ‌న మేర‌కు బిహార్ ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోర‌గా.. ప్రభుత్వం సీబీఐ ద‌ర్యాప్తునకు ఓకే చెప్పింది. అయితే బిహార్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న కేసును ముంబయికి బదిలీ చేయాల‌ని, ఇందులో సీబీఐ జోక్యం అవ‌స‌రం లేద‌ని కోరుతూ రియా చక్ర‌వ‌ర్తి సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేసింది. దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 19న సీబీఐకి కేసును అప్పగించింది. దీంతో ఈ రోజు నుంచి రంగంలోకి దిగి నటుడు కేసును ఛేదించనుంది కేంద్ర దర్యాప్తు సంస్థ.

ఇది చూడండి యూఏఈకి పయనమైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్

ABOUT THE AUTHOR

...view details