నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నిర్మాత కరణ్ జోహార్.. త్వరగా తమ వాదనలను వినిపించాలని బిహార్ ముజఫర్పుర్ కోర్టు ఆదేశించింది. రానున్న జనవరి తొలి వారంలోగా ఈ ప్రక్రియ జరగాలని ఆదేశించింది.
సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక బాలీవుడ్ ప్రముఖుల హస్తం ఉందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బిహార్‌లోని ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్.. కొంతకాలం క్రితం ముజఫర్పుర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 306, 109, 504, 506 కింద సల్మాన్, కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్యా చోప్రా, ఏక్తా కపూర్ సహ మరి కొంతమందిపై కేసు నమోదు చేశారు. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడేలా వీరంతా పురికొల్పారని ఫిర్యాదు చేశారు.