బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వార్త.. ప్రతి ఒక్కరిని కదలించింది. అంత మంచి నటుడు, 34 ఏళ్లకే ఎందుకు తనువు చాలించాడు? చనిపోవాల్సి వచ్చిందా? ప్రేమ వ్యవహారం దీనికి కారణమా? ఇలా రకరకాల ప్రశ్నలు.. అభిమానుల మనసుల్ని తొలచివేశాయి. అయితే పోస్టుమార్టం అనంతరం కొన్ని బాధ కలిగించే అంశాలు బయటకొచ్చాయి.
సుశాంత్ ఇంట్లో లభించిన కొన్ని మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా అతడు, కొన్నినెలల నుంచి హైపర్ టెన్షన్, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది. వీటిని తగ్గించేందుకు డాక్టర్ ఇచ్చిన మందులను కొన్నాళ్ల నుంచి వేసుకోవడమే మానేశాడు. సుశాంత్‌కు ఆర్థికపరమైన ఇబ్బందులు లేవని, అతడి బ్యాంక్ ఖాతాలో చాలానే డబ్బున్నట్లు స్పష్టమైంది.
సుశాంత్‌కు తన ప్రేయసి రియా చక్రవర్తితో కొన్నిరోజుల క్రితం గొడవైంది. దీంతో వీరిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. చనిపోవడానికి ముందు ఆమెతో పాటు తన స్నేహితుడు మహేశ్ శెట్టితో మాట్లాడేందుకు సుశాంత్ ప్రయత్నించగా వారు స్పందించలేదు.