బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ గత ఆరు నెలల్లో ఏడు సినిమాలను కోల్పోయాడని రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ తెలిపారు. గతేడాది విడుదలైన 'చిచోరే' విజయం తర్వాత సుశాంత్ ఏడు సినిమాలను అంగీకరించాడని.. అయితే ఆరు నెలల కాలంలోనే అవన్నీ అతడి నుంచి చేజారిపోయాయని వెల్లడించారు. అయితే ఆ సినిమాలేంటి అనేది మాత్రం సంజయ్ నిరుపమ్ స్పష్టత ఇవ్వలేదు.
"చిచోరే' సినిమా విజయం సాధించిన తర్వాత సుశాంత్ ఏడు సినిమాలను అంగీకరించాడు. అయితే ఆరు నెలల్లోనే అవన్నీ చేజారిపోయాయి. ఎందుకంటే? చిత్రపరిశ్రమలో క్రూరత్వం ఎక్కువ. అదే సుశాంత్ మరణానికి కారణమైంది. మనం ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయాము. సుశాంత్‌కు నా శ్రద్ధాంజలి"