తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈడీ విచారణకు సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంక - latest sushant singh news updates

సుశాంత్​ సింగ్​ కేసులో భాగంగా అతడి సోదరి ప్రియాంక సింగ్​ను ఈడీ విచారించింది. సుశాంత్​ ఖాతా నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు.

Sushant death case
సుశాంత్​

By

Published : Aug 21, 2020, 6:41 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ ఆత్మహత్య కేసులో భాగంగా మనీ ల్యాండరింగ్​ విషయమై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నటుడి సోదరి ప్రియాంక సింగ్​ వాంగ్మూలాన్ని శుక్రవారం రికార్డు చేసినట్లు అధికారులు తెలిపారు. సుశాంత్​ బ్యాంకు ఖాతా నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నించినట్లు తెలిపారు.

ఇటీవలే సుశాంత్​ తండ్రి కేకే సింగ్​, అతడి మరో సోదరి మితు సింగ్​లనూ అధికారులు విచారించారు. వీరితో పాటే సుశాంత్​ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు, నటుడి అకౌంటెంట్​(సీఏ) సందీప్​ శ్రీధర్​, మాజీ మేనేజర్​ శ్రుతి మోదీ తదితరులను ఈడీ ప్రశ్నించింది. సుశాంత్​ తండ్రి కేకే సింగ్​ బిహార్​ పోలీసు స్టేషన్​లో చేసిన ఫిర్యాదు మేరకు.. జులై 31న రియా, ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఇతరులపై ఈడీ మనీల్యాండరింగ్​ కేసు నమోదు చేసింది.

ABOUT THE AUTHOR

...view details