తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్​ను హత్య చేసినట్లు ఆధారాలు దొరకలేదు' - సుశాంత్ వార్తలు

సుశాంత్ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంలోని ఓ అధికారి.. అతడిని హత్య చేసినట్లు తమకు ఆధారాలు లభించలేదని చెప్పారు. ఇంకా కేసు విచారణ కొనసాగుతోందని అన్నారు.

సుశాంత్​ను హత్య చేసినట్లు ఆధారాల్లేవు: సీబీఐ అధికారి
సుశాంత్ సింగ్

By

Published : Sep 2, 2020, 11:13 AM IST

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసు విచారణను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించిన పలువురిని విచారిస్తూ వారి వాంగ్మూలాన్ని నమోదు చేస్తోంది. తాజాగా సీబీఐ బృందంలోని ఓ అధికారి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుశాంత్‌ హత్య జరిగినట్లు తమకు ఎక్కడా ఆధారాలు లభించలేదని, ఇంకా కేసు విచారణ కొనసాగుతోందని అన్నారు.

జూన్‌ 14న సుశాంత్‌ తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయి పోలీసులు, పోస్ట్‌మార్టం నివేదిక కూడా ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లే తెలిపింది. ఈ క్రమంలో అతడిని హత్య చేశారంటూ పలువురు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో సీబీఐ ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఆత్మహత్య జరిగిన సంఘటనను రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఇప్పటికైతే ఆ కోణంలోనే సీబీఐ విచారణ జరుపుతోంది. ఎయిమ్స్‌ ఫొరెన్సిక్‌ బృందం ఇచ్చిన నివేదికను కూడా సీబీఐ త్వరలోనే పరిశీలించనుంది.

మరోవైపు మానసిక ఒత్తిడి సమస్యతో బాధపడుతున్న సుశాంత్‌కు దిల్లీ ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ కుమార్‌ మందులు రాసినట్లు తాజాగా తెలిసింది. సుశాంత్‌ సోదరి ప్రియాంక ఆ మందుల కాగితాన్ని ఆయనకు అందించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details