బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని కూడా విచారిస్తున్నారు. అందుకోసం రెండు రోజులు సీబీఐ ముందు హాజరైన రియా తాజాగా మూడో రోజునా విచారణకు వచ్చింది.
మూడో రోజూ సీబీఐ ముందుకు రియా చక్రవర్తి - Rhea called for questioning by CBI
సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. అతడి ప్రేయసి రియా చక్రవర్తిని మూడో రోజు విచారణకు పిలిచారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆమె సోదరుడు షౌహిక్ చక్రవర్తితో పాటు ఈరోజు విచారణకు హాజరైంది రియా.
![మూడో రోజూ సీబీఐ ముందుకు రియా చక్రవర్తి మూడో రోజూ సీబీఐ ముందుకు రియా చక్రవర్తి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8613046-1059-8613046-1598768996888.jpg)
మూడో రోజూ సీబీఐ ముందుకు రియా చక్రవర్తి
రియాతో పాటు ఆమె సోదరుడు షౌహిక్ చక్రవర్తి కూడా నాలుగు రోజులుగా విచారణకు హాజరవుతున్నాడు. సుశాంత్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు, రియా-సుశాంత్ మధ్య ప్రేమ, సుశాంత్ కుటుంబంతో రియాకు ఉన్న సాన్నిహిత్యంతో సహా పలు అంశాలపై సీబీఐ విచారణ కొనసాగుతోంది.