బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్.. గత నెల 14వ తేదీన తన సొంత ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ముంబయి పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇతడితో పాటే ఈ కేసుతో సంబంధమున్న 30 మంది వాంగ్మూలాలు తీసుకోనున్నారు.
వీరిలో సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులతో పాటు అతడి ప్రేయసి రియా చక్రవర్తి, క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చబ్రా, యశ్రాజ్ ఫిల్మ్స్ క్యాస్టింగ్ డైరెక్టర్ షానో శర్మతో పాటు పలువురు ఉన్నారని పోలీస్ అధికారి వెల్లడించారు.