బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసు ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. విచారణలో భాగంగా ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని రియాతోపాటు ఆమె సోదరుడు షోవిక్ ఎన్‌సీబీకి వెల్లడించారు.
లాక్‌డౌన్ సందర్భంగా ఏప్రిల్ నెలలో సుశాంత్.. తన ప్రేయసి రియా చక్రవర్తితో కలిసి కొన్నిరోజులు ఆమె ఇంట్లోనే ఉండాలనుకున్నాడు. ఆ తర్వాత సుశాంత్-రియా కలిసి 500 గ్రాముల మత్తుపదార్థాలను ప్యాక్‌చేసి కొరియర్‌లో ఆ ఇంటికి పంపించాలనుకున్నారు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా గృహోపకరణాలతో డ్రగ్స్‌ను పార్సిల్ చేశారు. అనంతరం సుశాంత్ దగ్గర పనిచేసే దీపేశ్ సావంత్ సదరు కొరియర్ ఏజెన్సీ బాయ్‌తో రియా ఇంటికి పార్సిల్‌ను పంపించగా ఆమె సోదరుడు షోవిక్ దాన్ని అందుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో ఎన్‌సీబీ అధికారులు సదరు కొరియర్ ఏజెన్సీ, బాయ్‌ని కూడా విచారిస్తున్నారు.