తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​ జోరు.. రెండు నెలలు.. రెట్టింపు వినోదాలు

ఏటా వందలాది చిత్రాలు విడుదలైనా వాటిలో కొన్నైనా బ్లాక్‌బస్టర్‌ చిత్రాలుగా నిలిచిపోతాయి. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తాయి. కానీ ఈ ఏడాది కరోనా పరిస్థితుల మధ్య భయం భయంగానే మొదలైంది. ఇప్పటివరకూ అయితే సరైన చిత్రం బాలీవుడ్‌లో విడుదల కాలేదు. అయినా ఈ ఏడాది ముగిసిపోలేదు. రెట్టించిన ఉత్సాహంతో ఈ రెండు నెలల్లో భారీ అంచనాల మధ్య అగ్రహీరోల చిత్రాలు రాబోతున్నాయి. ఈ రెండు నెలల్లో విడుదలయ్యే చిత్రాలు తీవ్రంగా నష్టపోయిన బాలీవుడ్‌కు భారీ ఉపశమనమే కలిగిస్తాయనే ఆశతో ఉంది చిత్రసీమ. ఇంతకీ రిలీజ్​ అయ్యే ఆ మూవీస్​ ఏంటంటే....

bollywood
బాలీవుడ్​

By

Published : Nov 2, 2021, 6:34 AM IST

Updated : Nov 2, 2021, 7:09 AM IST

ఏడాది ఆరంభంలో భారీ బాలీవుడ్‌ చిత్రాలు రాలేదు కానీ చిన్న బడ్జెట్‌ చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. కానీ ఒక్కటీ వావ్‌ అనిపించలేదు. ఇంతలోనే రెండో వేవ్‌ విజృంభించింది. దీంతో సినిమాలన్నీ ఓటీటీ బాట పట్టాయి. థియేటర్లు మొదలయ్యాకా అక్షయ్‌కుమార్‌ 'బెల్‌ బాటమ్‌' విడుదలైంది. ఈ చిత్రం భారీ వసూళ్లు అందుకోలేదుకానీ థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలకు కొత్త ఊపిరి పోసింది. మిగిలిన ఈ రెండు నెలల్లో పది చిత్రాలకు పైగా థియేటర్లలోనే విడుదల కానున్నాయి. ఇందులో 'సూర్యవంశీ', 'బంటీ ఔర్‌ బబ్లీ 2', 'సత్యమేవ జయతే 2', 'అంతిమ్‌', '83', 'జెర్సీ' లాంటి భారీ చిత్రాలున్నాయి.

బాలీవుడ్‌ భారీగా ఆశలుపెట్టుకున్న చిత్రం 'సూర్యవంశీ'(suryavamsam akshay kumar release date). అక్షయ్‌కుమార్‌ పోలీస్‌ పాత్రలో నటించిన ఈ చిత్రంలో అజయ్‌దేవ్‌గణ్‌, రణవీర్‌సింగ్‌ అతిథి పాత్రల్లో నటించారు. రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 5న రానుంది. ఇందులో కత్రినాకైఫ్‌ కథానాయిక. థియేటర్లోనే విడుదల చేయాలని సుమారు ఏడాదిన్నరగా ఎదురుచూస్తోంది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది(sooryavanshi trailer akshay kumar).

ఇక ఈనెల్లో రానున్న మరో క్రేజీ చిత్రం 'బంటీ ఔర్‌ బబ్లీ 2'(saif ali khan bunty aur babli 2). క్రైమ్‌ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. సిద్ధాంత్‌ చతుర్వేది, శర్వరీ వాఘ్‌ జంటగా నటించిన ఈ చిత్రం 19న రానుంది. వరుణ్‌ వి శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మించింది(bunty aur babli 2 trailer).

నవంబరు 25న 'సత్యమేవ జయతే 2'(john abraham satyamev jayate 2 release date), 26న 'అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌'(salman khan antim trailer release date) రానున్నాయి. రెండూ యాక్షన్‌ కథాంశం ఉన్న చిత్రాలే. జాన్‌ అబ్రహం కథానాయకుడిగా మిలాప్‌ జవేరీ దర్శకత్వంలో 'సత్యమేవ జయతే 2' తెరకెక్కింది. ఇందులో జాన్‌ అబ్రహం త్రిపాత్రాభినయం చేస్తున్నారు.

ఆయుష్‌ శర్మ కథానాయకుడిగా సల్మాన్‌ఖాన్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అంతిమ్‌’. మహేష్‌ మాంజ్రేకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ మాస్‌ ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

నవంబరులో వస్తున్న నాలుగు చిత్రాలు బాక్సాఫీసు వద్ద సుమారుగా రూ.375 కోట్లు పైనే వసూలు చేయబోతున్నాయి అని బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలు అంచనా. ఇందులో ‘సూర్యవంశీ’ వాటా ఎక్కువే ఉంటుందని చిత్రవర్గాలు భావిస్తున్నాయి.

డిసెంబరులో అదే సందడి

తెలుగు చిత్రం 'ఆర్‌ ఎక్స్‌ 100'కు(rx 100 hindi remake) హిందీ రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం 'తడప్‌'. ఈ చిత్రం డిసెంబరు 3న విడుదల కానుంది. సునీల్‌శెట్టి తనయుడు అహాన్‌శెట్టి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. మిలన్‌ లుథిరా దర్శకుడు. యువతరంలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా తెరకెక్కిన 'చంఢీఘడ్‌ కరే ఆషికి'. రొమాంటిక్‌ డ్రామాగా అభిషేక్‌ కపూర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం 10న రానుంది. ఇక బాలీవుడ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రం '83'. 1983లో భారత క్రికెట్‌ జట్టు సాధించిన ప్రపంచకప్పు విజయం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ నటించాడు. ప్రముఖ దర్శకుడు కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ వసూళ్లు అందుకుంటుందని సినీ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఏడాది చివరి రోజు విడుదల కాబోతున్న మరో భారీ చిత్రం 'జెర్సీ'(jersey hindi remake trailer). తెలుగులో మంచి విజయం సాధించడమే కాదు జాతీయ పురస్కారం అందుకున్న ‘జెర్సీ’కి హిందీ రీమేక్‌గా ఈ చిత్ర దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి తీసిన చిత్రమిది. ఇందులో ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు షాహిద్‌ కపూర్‌ నటించాడు. ఈ ఏడాది మొత్తం ఎలా గడిచిపోయినా...ఈ రెండు నెలల మాత్రం థియేటర్లకు చాలా ఆశాజనకంగా ఉంటుందని చిత్రసీమ కొండంత నమ్మకంతో ఉంది.

ఇదీ చూడండి: ముద్దుగుమ్మ నోరా.. హాట్ హాట్​గా..!

Last Updated : Nov 2, 2021, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details