నిహారిక కోసం వస్తున్న విజయ్ దేవరకొండ! - స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు
నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సూర్యకాంతం’. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని మార్చి 23న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది చిత్రబృందం. దీనికి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ రానున్నాడు.
'సూర్యకాంతం' వేడుకలో విజయ్ దేవరకొండ సందడి
నిర్వాణ సినిమాస్ పతాకంపై రూపొందిన చిత్రం ‘సూర్యకాంతం’. రొమాంటిక్ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించారు. నిహారిక కొణిదెల కథానాయిక. ప్రణీత్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర విడుదలను పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటలకు వేడుక ఏర్పాటు చేశారు. ‘సూర్యకాంతం’ యూనిట్‌తో పాటు విజయ్ దేవరకొండ ఈ ఈవెంట్లో సందడి చేయనున్నాడు.
- ఈ మూవీలో నిహారిక సరసన స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు, ఈ మాయ పేరేమిటో ఫేం రాహుల్ విజయ్ నటించాడు. మార్క్ రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.