తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎన్​జీకేపై మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా: సూర్య - surya

తమిళ హీరో సూర్య నటించిన 'ఎన్​జీకే' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ విషయంపై స్పందిస్తూ ట్వీట్ చేశాడు సూర్య.

సూర్య

By

Published : Jun 7, 2019, 6:03 PM IST

తమిళంతో పాటు తెలుగులోనూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాందిచుకున్న హీరో సూర్య. ఈ హీరో నటించిన 'ఎన్​జీకే' చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించడం వల్ల సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద బోల్తా కొట్టింది.

పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులను అంతలా ఆకట్టుకోలేదు. ఈ విషయంపై సూర్య స్పందిస్తూ ఓ ట్వీట్ చేశాడు.

"ఎన్​జీకే చిత్రంపై మీ ప్రేమ, ఆలోచనలు, అభిప్రాయాలను ఎంతో గౌరవిస్తున్నా. ఈ చిత్రం కోసం పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు. ఈ కొత్త ప్రయత్నాన్ని అర్థం చేసుకుని అభినందించిన వారికి ధన్యవాదాలు" అని ట్వీట్ చేశాడు. త్వరలో కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్​టైనర్ 'కాప్పాన్' చిత్రంలో నటిస్తున్నాడు సూర్య.

ఇవి చూడండి.. వెండితెరపై 'డిలీట్'... చిట్టితెరపై 'సూపర్​ హిట్'​

ABOUT THE AUTHOR

...view details