తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అసురన్‌' దర్శకుడితో సూర్య..? - vetrimaran

'అసురన్'​తో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వెట్రిమారన్​ తర్వాతి సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఇతడు సూర్యతో ఓ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

surya
సూర్య

By

Published : Dec 6, 2019, 8:36 AM IST

ధనుష్‌ కథానాయకుడిగా 'అసురన్‌' చిత్రం తెరకెక్కించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు వెట్రి మారన్‌. ఈ సినిమా విజయంతో అతడి తర్వాతి ప్రాజెక్టుపై సినీ అభిమానులందరిలో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఎందరో అగ్ర కథానాయకుల పేర్లు వినిపించాయి. అయితే ఈ దర్శకుడు నటుడు సూర్యతో చేయబోతున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రస్తుతం సూర్య 'ఆకాశం నీ హద్దురా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది సెట్స్‌పై ఉండగానే సూర్య 39వ చిత్రం వెట్రిమారన్‌తో అని నెట్టింట చర్చ ఊపందుకుంది. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య చర్చలు సాగాయిని కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే నెటిజనుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చర్చకు కారణం ఏంటంటే? వెట్రిమారన్‌ డిసెంబరు 5న ఓ అప్‌డేట్‌ ఇవ్వబోతున్నానని పెట్టడం వల్ల అభిమానులు సినిమా ఖరారైందనే తరహాలో మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

ఇవీ చూడండి.. ఫ్యాన్​ మేడ్​ ఫొటోలు చూసి అవాక్కయిన యాంకర్ సుమ

ABOUT THE AUTHOR

...view details