తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పంచెకట్టులో సూర్య​... అదిరిన ఉగాది​ కానుక - తమిళ న్యూ ఇయర్​

తమిళ సూపర్​స్టార్​ సూర్య ఈ ఏడాది ఫుల్​ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ఎన్​జీకే చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఏప్రిల్​ 14 తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా 38వ సినిమా చిత్ర టైటిల్​ లుక్​ విడుదల చేశాడు.

పంచెకట్టులో సూర్య​...అదిరిన న్యూఇయర్​ కానుక

By

Published : Apr 14, 2019, 3:24 PM IST

తెలుగు, తమిళంలో భారీ సంఖ్యలో అభిమానులున్న హీరోల్లో సూర్య ఒకరు. ఆయన సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులకు తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా తీపికానుక ఇచ్చాడు. తన 38వ చిత్ర టైటిల్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో సూర్య నల్ల చొక్కా, తెల్ల పంచె క‌ట్టి విమానం వైపు తదేకంగా చూస్తున్నాడు.

  1. శూర‌రై పోట్రు అనే టైటిల్‌తో గురు ఫేం సుధా కొంగ‌ర ఈ సినిమా తెర‌కెక్కించ‌నున్నారు. సూర్య ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు.
  2. ఎయిర్‌ డెక్కెన్‌ వ్యవస్థాపకులు పైలెట్‌ జీఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

‘సర్వం తాళమయం’ ఫేం అపర్ణా బాలమురళి హీరోయిన్‌గా నటిస్తోంది. మోహన్‌బాబు ఓ కీలక పాత్రలో నటించనున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్ బాణీలు సమకూరుస్తున్నారు.

క‌ప్పాన్ పేరుతో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంలోనూ నటిస్తున్నాడు సూర్య. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.

ABOUT THE AUTHOR

...view details