తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సూర్య-పాండిరాజ్ చిత్రం షూటింగ్ షురూ - surya pandiraj news movie shooting styartsd

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో పాండిరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిపింది చిత్రబృందం.

Surya new movie shooting starts
సూర్య-పాండిరాజ్ కొత్త చిత్రం షూటింగ్ షురూ

By

Published : Feb 15, 2021, 4:03 PM IST

సూర్య కథానాయకుడిగా పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'సూర్య 40' వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

సూర్య మినహా ఇతర తారాగణం సెట్స్‌లో అడుగుపెట్టింది. సూర్య త్వరలోనే చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ సినిమాకు డి.ఇమాన్‌ సంగీతం అందిస్తున్నారు. గతంలో పాండిరాజ్‌-సూర్య కాంబినేషన్‌లో 'పసంగ 2' చిత్రం రూపొందింది. తెలుగులో 'మేము' పేరుతో విడుదలైంది. మరోసారి ఈ కలయికలో సినిమా వస్తుండటం వల్ల అంచనాలు పెరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details