తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటీటీ స్టార్​గా సూర్య.. ప్రైమ్​లో 'జై భీమ్' - అమెజాన్ ప్రైమ్​లో సూర్య జై భీమ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న 'జై భీమ్' ఓటీటీ రిలీజ్​ను ఖరారు చేసింది చిత్రబృందం. దీంతో పాటు సూర్య నిర్మిస్తోన్న మరో మూడు చిత్రాలూ ప్రైమ్​లోనే విడుదల కానున్నాయి.

Team India
టీమ్ఇండియా

By

Published : Aug 5, 2021, 12:34 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న కొత్త చిత్రం 'జై భీమ్'. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్​, ఫస్ట్​లుక్​ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా చిత్రబృందం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ మూవీని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. నవంబర్​లో అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ చేస్తామని వెల్లడించింది.

సామాజిక, రాజకీయ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. రజీషా విజయన్ హీరోయిన్​గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. సూర్య స్వీయ నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ కింద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరో మూడు

సూర్య నటించిన 'జై భీమ్'​తో పాటు ఆయన నిర్మిస్తోన్న మరో మూడు సినిమాలు అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానున్నాయి. సెప్టెంబర్​లో 'రామే ఆందలుమ్, రావనే ఆందలుమ్' (తమిళం), డిసెంబర్​లో 'ఓ మై డాగ్' (తమిళం, తెలుగు), అక్టోబర్​లో 'ఉడాన్​పిరప్పే' (తమిళం, తెలుగు) చిత్రాలు విడుదల కానున్నాయి.

ఇవీ చూడండి: నిహారిక ఇంటి వద్ద అర్ధరాత్రి గొడవ.. పరస్పరం ఫిర్యాదు!

ABOUT THE AUTHOR

...view details