మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం 'క్రాక్'. దీపావళి సందర్భంగా ఆ చిత్రంలోని 'భూమ్ బద్దలు' అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన శ్రుతిహాసన్ నటిస్తున్నారు. తమన్ స్వరాలను సమకూరుస్తున్నారు.
దీపావళి సందర్భంగా 'మోస్ట్ ఎలిజెబుల్ బ్యాచిలర్' చిత్రం నుంచి చిత్రబృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.
'మోసగాళ్లు' సినిమా నుంచి ఓ స్పెషల్ టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. సునీల్ శెట్టి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసేలా ఈ వీడియోని తీర్చిదిద్దారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవదీప్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
నాగశౌర్య, రీతూవర్మ కలిసి నటిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు చిన్నపాటి వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. సితార ఎంటర్టైన్మైంట్స్ సంస్థ నిర్మిస్తుంది.
టాలీవుడ్ యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు శుక్రవారం చిత్రబృందం ప్రకటించింది.