వరుస సినిమాలతో అలరిస్తున్న హీరో సూర్య.. మరో కొత్త ప్రాజెక్టు ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని నేడు(ఆదివారం) అధికారికంగా ప్రకటించారు. గతంలో సూర్యతో ఐదుసార్లు పనిచేసిన హరినే, ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నాడు. 'అరువా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు 'సింగం' సిరీస్‌తో పాటు, ఆరు, వేల్(తెలుగులో 'దేవా') చిత్రాలు వచ్చాయి.
హీరో సూర్య.. అచ్చొచ్చిన దర్శకుడితో ఆరోసారి
తనకు అచ్చొచ్చిన దర్శకుడు హరితో మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాడు హీరో సూర్య. టైటిల్ నిర్ణయించడం సహా విడుదల తేదీని నేడు(ఆదివారం) ప్రకటించారు.
హీరో సూర్య
#సూర్య39 షూటింగ్ ఏప్రిల్‌లో మొదలై, ఒకే షెడ్యూల్లో పూర్తవుతుందని నిర్మాతలు చెప్పారు. దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రేజీ సినిమాకు ఇమ్మన్ సంగీతమందించనున్నాడు.
సూర్య ప్రస్తుతం 'సూరరై పోట్రు(ఆకాశం నీ హద్దురా!)'లో నటిస్తున్నాడు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Last Updated : Mar 3, 2020, 2:09 AM IST