తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో సూర్య.. ఆకాశమే హద్దుగా ఎగురుతున్నాడు! - Soorarai Pottru First Look

సూర్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'ఆకాశం నీ హద్దురా' సినిమా ఫస్ట్​లుక్​ ఆకట్టుకుంటోంది. వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

హీరో సూర్య

By

Published : Nov 10, 2019, 4:51 PM IST

Updated : Nov 10, 2019, 6:47 PM IST

కోలీవుడ్​ స్టార్ హీరో సూర్య.. ప్రస్తుతం 'సూరరై పొట్రు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫస్ట్​లుక్​ను ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే టైటిల్​ ఖరారు చేశారు. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ప్రకటించారు.

'ఆకాశమే నీ హద్దురా' సినిమా ఫస్ట్​లుక్

సూర్య.. మారా అనే పాత్రలో కనిపించనున్నాడు. ఎయిర్ డెక్కన్ సృష్టికర్త కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగాఈ చిత్రం తీస్తున్నారు. అపర్ణా బాలమురళి హీరోయిన్. జాకీష్రాఫ్, పరేశ్ రావల్, మోహన్​బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నాడు. 'గురు' ఫేమ్​ సుధా కొంగర దర్శకత్వం వహిస్తోంది. 2డీ ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకం సూర్య నిర్మిస్తున్నాడు.

సూర్య గత చిత్రాలు 'ఎన్​జీకే', 'బందోబస్తు'.. బాక్సాఫీస్​ వద్ద విఫలమయ్యాయి. ఈ సినిమాతో మళ్లీ ఫామ్​లోకి రావాలని చూస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే 'ఖైదీ' ఫేమ్ లోకేశ్​ కనకరాజ్​తో పనిచేయనున్నాడని సమచారం.

ఇది చదవండి: విభిన్న పాత్రల కథానాయకుడు 'సూర్య'.. పుట్టినరోజు ప్రత్యేకం

Last Updated : Nov 10, 2019, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details