కథానాయకుడు సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి. వీరిద్దరూ కలసి 'సింగం' సిరీస్‌లో మూడు చిత్రాలు తీసి మెప్పించారు. తమిళంలో తీసిన ఈ సినిమాలు తెలుగులోనూ విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ కథల్లో సూర్య పోలీసు అధికారిగా నేరస్తులను ఆటకట్టించే తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు వీరిద్దరూ సింగం-4కు సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
SURIYA: 'సింగం' సిరీస్ నుంచి నాలుగో సినిమా - suriya hari singam 4
సూర్య-హరి కాంబినేషన్ నుంచి నాలుగో 'సింగం' వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ఆగస్టులో షూటింగ్ మొదలుకానుండగా, వచ్చే ఏడాది సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
సూర్య సింగం సిరీస్
ఇప్పటికే దీనికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఆగస్టులో చిత్రీకరణ మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సూర్య ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. దీంతో పాటు హరి కాంబినేషన్లో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. గత చిత్రాల్లో లాగే అనుష్క సింగం-4లో సూర్యతో జోడీగా నటించనుంది.
ఇవీ చదవండి: