కోలీవుడ్ హీరో సూర్యతో మరోసారి రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతోంది అనుష్క. ఇప్పటికే ఈ జోడీ.. 'సింగం' సిరీస్‌తో ప్రేక్షకుల్ని మెప్పించింది. త్వరలో కొత్త చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతోంది. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ ముగ్గురూ ఎవరి ప్రాజెక్ట్‌ల్లో వారు బిజీగా ఉన్నారు. అవి పూర్తయిన తర్వాతే ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం.
సూర్య.. ప్రస్తుతం 'ఆకాశం నీ హద్దురా'(సూరరై పోట్రు) సినిమాతో బిజీగా ఉన్నాడు. సుధా కొంగర దర్శకురాలు. వచ్చే నెలలో ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.