తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బందోబస్త్'గా వస్తున్న హీరో సూర్య - కప్పన్

సూర్య కొత్త సినిమా 'బందోబస్త్' పోస్టర్లను ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. మోహన్​లాల్, ఆర్య.. ఇందులో ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

'బందోబస్త్'గా వస్తున్న హీరో సూర్య

By

Published : Jun 28, 2019, 12:05 PM IST

ఇటీవలే 'ఎన్​.జి.కె'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు హీరో సూర్య. త్వరలో మరో చిత్రాన్ని తెచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తమిళంలో 'కాప్పన్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తెలుగులో 'బందోబస్త్' అనే టైటిల్​ నిర్ణయించారు. ట్విట్టర్​ వేదికగా పోస్టర్లను విడుదల చేశారు ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి.​

రాజమౌళికి ధన్యవాదాలు చెపుతూ హీరో సూర్య ట్వీట్

మోహన్​లాల్, ఆర్య, సాయేషా సైగల్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సూర్యతో 'వీడొక్కడే', 'బ్రదర్స్' చిత్రాలు రూపొందించిన కేవీ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.​ హరీశ్ జైరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్​ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బందోబస్తు ఫస్ట్​లుక్ పోస్టర్

ఇది చదవండి: సూర్య సినిమాలో విలన్​గా విలక్షణ నటుడు మోహన్​బాబు

ABOUT THE AUTHOR

...view details