keerthy suresh surya movie: 'గ్యాంగ్' చిత్రంతో ఆకట్టుకున్న జంట సూర్య, కీర్తి సురేశ్. ఇప్పుడు ఈ జోడీ మరోసారి కలిసి నటించనుంది అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. 20 ఏళ్ల తర్వాత ప్రముఖ దర్శకుడు బాలా దర్శకత్వంలో సూర్య ఓ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన కీర్తిని సంప్రదించినట్లు తెలుస్తోంది.
surya bala movie: సూర్య, బాలా కాంబినేషన్లో వచ్చిన 'నందా', 'పితామగన్' చిత్రాలు మంచి విజయం సాధించాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే బాలా దర్శకత్వంలో కీర్తి నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. కీర్తి తెలుగులో మహేశ్‌బాబుతో 'సర్కారు వారి పాట', చిరంజీవి 'భోళా శంకర్' చిత్రాల్లో నటిస్తోంది.