Suriya ET movie twitter review: ఇటీవలే ఓటీటీ వేదికగా 'సూరరైపోట్రు', 'జైభీమ్' చిత్రాలతో విజయాన్ని అందుకున్న తమిళ స్టార్ హీరో సూర్య.. మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 'ఈటీ' సినిమాతో థియేటర్లో సందడి చేశారు. పాండిరాజ్ దర్శకత్వంలో నేడు విడుదలైన ఈ చిత్రం సోషల్‌మీడియాలో హిట్‌టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రం చూసిన అభిమానులు మూవీ అదిరిపోయిందని ఈలలు వేస్తున్నారు. మహిళలకు ఎలా భరోసా, భద్రతను కల్పించాలో ఈ సినిమా ద్వారా దర్శకుడు అద్భుతంగా చూపించారని చెప్తున్నారు. స్త్రీల సమస్యలపై పోరాడేే పాత్రలో కన్నభిరన్గా సూర్య నటన కేక పుట్టిస్తోందని అంటున్నారు. ఫస్టాఫ్ మాస్ జాతర, సెకండాఫ్ డీసెంట్‌గా సాగుతోందని, మొత్తంగా సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వెల్ సీన్ పూనకాలు తెప్పిస్తుందట! థియేటర్ల ముందు బాణాసంచా కాలుస్తూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 'కోటు వేసుకునే జడ్జి వేరే.. పంచె ఎగ్గడితే నేనేరా జడ్జిని', 'అమ్మాయిలు అంటే బలహీనులు అనుకుంటారు. బలవంతులు అని నిరూపించాలి' వంటి డైలాగ్‌లు అదిరిపోయాయని వారు పేర్కొంటున్నారు.
Suriya ET movie: 'ఈటీ' మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే? - సూర్య ఈటీ మూవీ ట్విట్టర్ రివ్యూ
Suriya ET movie twitter review: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కొత్త చిత్రం 'ఈటీ' నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా గురించి ఫ్యాన్స్ సోషల్‌మీడియా ద్వారా రివ్యూలు ఇస్తున్నారు. వాటిని చూసేద్దాం..
![Suriya ET movie: 'ఈటీ' మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే? suriya et movie review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14688078-thumbnail-3x2-suriya.jpg)
సూర్య ఈటీ మూవీ రివ్యూ
కాగా, ఈ చిత్రంలో సూర్యకు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. వినయ్‌రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషించారు. డి.ఇమ్మాన్ స్వరాలందించారు.
ఇదీ చూడండి: 'అఖండ' 100 డేస్ ఫంక్షన్.. 'ఆర్ఆర్ఆర్' ఐమ్యాక్స్ వెర్షన్
Last Updated : Mar 10, 2022, 8:19 AM IST