Suriya ET Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రేరణతోనే ఫౌండేషన్ మొదలు పెట్టి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు తమిళ స్టార్ సూర్య. ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రం 'ఈటీ'(ఎవరికి తలవంచడు) ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. కరోనా విపత్కర సమయంలోనూ తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చిత్రపరిశ్రమను ఆదుకున్నారన్నారని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలకు వస్తే తన సొంత రాష్ట్రానికి వచ్చినట్లుందన్నారు. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాతలు దగ్గుబాటి సురేశ్, 'దిల్'రాజు, దర్శకులు బోయపాటి శ్రీను, మలినేని గోపిచంద్ పలువురు నటీనటులు పాల్గొన్నారు.
Suriya ET Movie: 'ఆ విషయంలో చిరంజీవే నాకు ప్రేరణ' - et movie
Suriya ET Movie: తన సామాజిక కార్యక్రమాలకు మెగాస్టార్ చిరంజీవి ప్రేరణగా నిలిచారన్నారు తమిళ స్టార్ సూర్య. హైదరాబాద్లో జరిగిన తన కొత్త చిత్రం 'ఈటీ'(ఎవరికి తలవంచడు) ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు.
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కొత్త సినిమా 'ఈటీ'(ఎవరికి తలవంచడు). ఈ సినిమాను తెలుగు, తమిళం సహా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సూర్యకి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. వినయ్‌రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. డీ ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో తెలుగులో కూడా సూర్య సొంతంగా డబ్బింగ్ చెప్పాడు. మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని ఏషియన్ మల్టిప్లెక్స్ నిర్మాణ సంస్థ తెలుగులో విడుదల చేయనుంది.
ఇదీ చదవండి:Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ఆర్థిక సాయం