తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిన్నారుల ఆవేదన విని సూర్య కన్నీళ్లు - శివ కుమార్​

పేద విద్యార్థులను చదివించడమే లక్ష్యంతో 'అగరం' ఫౌండేషన్​ను తమిళ నటుడు సూర్య ఏర్పాటుచేశాడు. ఈ సంస్థతో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నాడు. తాజాగా సంస్థ 10వ వార్షికోత్సవ వేడుకలో పేద విద్యార్థుల బాధను విని కన్నీటి పర్యంతమయ్యాడు.

Suriya-becomes-emotional-again-and-cries-on-stage
వేదికపై కన్నీటి పర్యంతమైన సూర్య

By

Published : Jan 27, 2020, 9:32 PM IST

Updated : Feb 28, 2020, 4:47 AM IST

తమిళ కథానాయకుడు సూర్య మరోసారి వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న చిన్నారులను చదివించేందుకు ఆయన 'అగరం' ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంస్థ పదో వార్షికోత్సవం తాజాగా చెన్నైలో జరిగింది. దీనికి సూర్య, ఆయన తండ్రి శివకుమార్‌తోపాటు సోదరుడు కార్తి కూడా హాజరయ్యారు. ఫౌండేషన్‌ కోసం శ్రమిస్తున్న జయశ్రీ, ఆమె కుటుంబం గురించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ క్రమంలో సూర్య ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. ఉద్వేగం తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు.

సూర్య మాట్లాడుతూ.. తాను భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ చిత్రాల్లో నటిస్తానని.. అలా వచ్చిన డబ్బుతో చిన్నారులకు మంచి చదువును అందించడానికి సాయం చేస్తానన్నాడు. ఇటీవలే ఫౌండేషన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో.. ఓ పేద విద్యార్థిని తాను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తుండగా.. సూర్య కంట తడి పెట్టుకున్న విషయం తెలిసిందే.

ఇదీ చూడండి.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ వంద కోట్లు..!

Last Updated : Feb 28, 2020, 4:47 AM IST

ABOUT THE AUTHOR

...view details