ప్రముఖ దర్శకులు మణిరత్నం-జయేంద్ర.. సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. 'నవరస'(Navarasa) పేరుతో తొమ్మిది లఘచిత్రాల్ని నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సూర్య(Suriya)తో పాటు అరవింద స్వామి, సిద్దార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, రేవతి, నిత్యా మేనన్, పార్వతి, ఐశ్వర్య రాజేశ్, పూర్ణ, ప్రసన్న, సింహా, గౌతమ్ కార్తిక్, అశోక్ సెల్వన్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్నారు. దీనికి సంబంధించిన తొలి ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. అందులో హీరో సూర్య, నటి ప్రయాగరోజ్ మార్టిన్లు ఉన్నారు.
ఈ సిరీస్ ద్వారా వచ్చే మొత్తాన్ని, కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోలీవుడ్ కార్మికుల కోసం వినియోగించనున్నారు. 'నవరస' ఆంతాలజీని నటనలోని తొమ్మిది రసాలు(హాస్యం, శృంగారం, కోపం etc..) ఆధారంగా తెరకెక్కించనున్నారు. దీని కోసం ప్రముఖ దర్శకులైన బెజోయ్ నంబియర్, గౌతమ్ మేనన్, కార్తిక్ సుబ్బరాజ్, కార్తిక్ నరేన్, కేవీ ఆనంద్, పొన్రమ్, రతీంద్రన్ ప్రసాద్, హరితా సాలిమ్, అరవింద స్వామి పనిచేయనున్నారు.
రిలీజ్ హక్కులు
టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్(Satyadev Kancharana) ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'తిమ్మరుసు'(Thimmarusu). సత్యదేవ్ ఇందులో న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జులైలో థియేటర్లు తెరిచిన వెంటనే విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన రిలీజ్ రైట్స్‌ను నిర్వాణసినిమాస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇటీవలే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది.
'సోడా సెంటర్'లో మాస్ సాంగ్..