తెలంగాణ

telangana

By

Published : Jul 22, 2021, 6:43 PM IST

ETV Bharat / sitara

సూర్య కొత్త చిత్రం ఫస్ట్​లుక్ అదిరిందిగా!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 40వ సినిమా ఫస్ట్​లుక్ రిలీజై ఆకట్టుకుటోంది. ఇందులో సూర్య పూర్తి మాస్ గెటప్​తో అలరించారు.

suriya
సూర్య

తమిళ స్టార్​ హీరో సూర్య 40వ సినిమా ఫస్ట్​లుక్ విడుదలైంది. శుక్రవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే ఫ్యాన్స్​కు ఈ సర్​ప్రైజ్ ఇచ్చారు. 'ఎతర్కుమ్ తునింధవన్' అనే టైటిల్​తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ చూస్తుంటే మాస్ అంశాలకు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియాంక అరుళ్ మోహన్​ ఆడిపాడనుంది. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. సన్​పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా తమిళనాడు పొల్లాచిలో రెండేళ్ల క్రితం జరిగిన గ్యాంగ్​రేప్​ కథాంశంతో రూపొందించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇవీ చూడండి: 'నా భర్తతో ప్రియమణి వివాహం చెల్లదు'

ABOUT THE AUTHOR

...view details