Suriya movies: అగ్ర కథానాయకుడు సూర్య నటించిన '24' దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచింది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. దీనికి సీక్వెల్ తెరకెక్కించే ఆలోచన ఉందని సినిమా విడుదలైనప్పుడే తెలిపారు విక్రమ్ కె.కుమార్. ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.
'24' కొనసాగింపు కథ సిద్ధమైందని, ఈ ఏడాదిలోనే ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.