తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సరిలేరు' లో 'వెంకిమామ' ఎపిసోడ్​..! - venky mama movie review

పాకిస్థాన్​ ఉగ్రస్థావరాలపై భారత్​ జరిపిన దాడుల స్ఫూర్తితో ప్రస్తుతం టాలీవుడ్​లో సినిమాలు రూపొందిస్తున్నారు. ఇటీవలె విడుదలైన వెంకీమామ చిత్రంలోని క్లైమాక్స్​ను ఈ నేపథ్యంలోనే తెరకెక్కించారు. తాజాగా సరిలేరు నీకెవ్వరు మూవీలోనూ ఇలాంటి తరహాలోనే ఉంటుందని సినీ వర్గాల్లో సమాచారం.

surgical strike based scene has put at sarileru nekevvaru movie
'సరిలేరు' లో 'వెంకిమామ' ఎపిసోడ్​..!

By

Published : Dec 14, 2019, 1:20 PM IST

పాకిస్థాన్​ ఉగ్రస్థావరాలపై భారత్​ జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'ఉరీ: ది సర్జికల్​ స్ట్రైక్'​. విక్కీ కౌశల్​ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ స్ఫూర్తితో టాలీవుడ్​లోనూ కొన్ని చిత్రాలు ఇప్పుడు ముస్తాబయ్యాయి.

నాగచైతన్య - వెంకటేశ్​ల 'వెంకీమామ', మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు'. ఈ రెండు చిత్రాల్లో చైతూ, మహేష్‌లు ఆర్మీ మేజర్‌లుగా నటించిన సంగతి తెలిసిందే. ఉరీ సంఘటన స్ఫూర్తితో చిత్రాల్లో కొన్ని కీలక ఎపిసోడ్లను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఇటీవల విడుదలైన 'వెంకీమామ'లో సర్జికల్‌ స్టైక్స్‌ నేపథ్యంతో వచ్చే క్లైమాక్స్‌ ఎపిసోడ్‌నే చూపించారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. త్వరలో రాబోయే 'సరిలేరు నీకెవ్వరు'లోనూ ఇదే తరహా ఎపిసోడ్‌ కనిపించనుందట. అయితే ఇది మహేష్‌ ఎంట్రీ నేపథ్యంలో వస్తుందని.. చిత్ర ప్రారంభంలో దాదాపు ఓ పదిహేను నిమిషాల పాటు ఉండే ఈ ఎపిసోడ్‌ సినీప్రియులకు ఆకట్టుకుంటుందని సినీ వర్గాల సమాచారం. మరి మహేష్‌ కనిపించే ఆ సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఎపిసోడ్‌ థియేటర్లో ఏ స్థాయిలో అలరించనుందో తెలియాలంటే జనవరి 11 వరకు వేచి చూడక తప్పదు.

'ఎఫ్‌ 2' తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. రష్మిక కథానాయికగా నటిస్తోంది. విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి:కేజీఎఫ్​ చాప్టర్​ 2 ఫస్ట్​లుక్​ తేదీ ఖరారు

ABOUT THE AUTHOR

...view details