తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సైరా' దర్శకుడి తర్వాత చిత్రం ఈ హీరోతోనే! - అల్లు అర్జున్ వార్తలు

'సైరా' వంటి భారీ చిత్రంతో మెప్పించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అయితే ఇతడి తర్వాత సినిమాపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు. తాజాగా సురేందర్.. అల్లు అర్జున్​తో ఓ సినిమా చేయబోతున్నాడంటూ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

Surender Reddy to direct Allu Arjun
సురేందర్ రెడ్డి

By

Published : Jun 29, 2020, 6:29 AM IST

మెగాస్టార్ చిరంజీవితో 'సైరా' వంటి భారీ చిత్రం తెరకెక్కించి అలరించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు తన తర్వాత చిత్రం గురించి ప్రకటించలేదీ దర్శకుడు. ప్రభాస్, అక్కినేని అఖిల్​తో సినిమాలు చేస్తాడని వార్తలు వచ్చినా అవేవీ కార్యరూపం దాల్చలేదు.

తాజాగా సురేందర్ రెడ్డి.. అల్లు అర్జున్​తో తన తర్వాత చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బన్నీ కోసం ఓ స్క్రిప్టును సిద్ధం చేస్తున్నాడట. ఈ సినిమా స్టైలిష్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతుందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details