తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"'పీఎం నరేంద్ర మోదీ' విడుదల ఆపలేం" - వివేక్ ఒబెరాయ్

'పీఎం నరేంద్ర మోదీ' చిత్రం విడుదలపై సుప్రీంలో ఇవాళా వాదనలు కొనసాగాయి. సినిమాను నిలుపివేయాలన్న పిటిషనర్​కు సుప్రీం పలు ప్రశ్నలు వేసింది.

సినిమా చూడకుండా ఎలా నిలుపుదల చేయమంటున్నారో చెప్పాలని పిటిషనర్​కు ప్రశ్నలు సంధించిన సుప్రీం

By

Published : Apr 8, 2019, 2:42 PM IST

'పీఎం నరేంద్రమోదీ' బయోపిక్​ విడుదలను ఆపాలంటూ సుప్రీంకోర్టులో న్యాయవాది అమన్​ పన్వర్​ పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న సుప్రీం... చిత్రంలో ఏ సన్నివేశాలు ఇబ్బందులు కలిగిస్తాయో చెప్పాలని అడిగింది. సినిమా చూడకుండా.. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఎలా చెప్తారని ప్రశ్నించింది. సెన్సార్​ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చాక విడుదలను ఆపలేమని స్పష్టం చేసింది.

  • వాదనలు మంగళవారానికి వాయిదా వేసింది. ఏ సన్నివేశాలు ఇబ్బంది కలిగిస్తాయో ఆధారాలు సమర్పించాలని పిటిషనర్​ను కోరింది అత్యున్నత న్యాయస్థానం.
  1. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగోయ్​ వాదనలు విన్నారు. సినిమా కాపీ ఇవ్వాలన్న పిటిషనర్​ అభ్యర్థనను తిరస్కరించింది కోర్టు.
  2. వ్యక్తిగతంగా ప్రత్యేక కాపీ ఇవ్వాలని చిత్ర బృందానికి తాము చెప్పలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.
  3. సినిమాకు సెన్సార్​ బోర్డు సర్టిఫికేషన్​ వస్తుందని నిర్మాత సందీప్​ సింగ్​ ముందే ఎలా చెప్పగలిగారంటూ కాంగ్రెస్​ తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. సినిమా ఆపాలన్న అభ్యర్థనకు ఇది సరైన కారణం కాదని సుప్రీం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details