తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గాయంపై స్పందించిన సూపర్​స్టార్ రజనీకాంత్ - tollywood news

'మ్యాన్ వర్సెస్ వైల్డ్​' షూటింగ్​లో తనకు గాయలేం కాలేదన్నాడు సూపర్​స్టార్ రజనీకాంత్. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పాడు.

గాయంపై స్పందించిన సూపర్​స్టార్ రజనీకాంత్
సూపర్​స్టార్ రజనీకాంత్

By

Published : Jan 29, 2020, 10:31 AM IST

Updated : Feb 28, 2020, 9:15 AM IST

'మ్యాన్​ వర్సెస్​ వైల్డ్​' చిత్రీకరణ కోసం మంగళవారం.. కర్ణాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​కు వెళ్లాడు సూపర్​స్టార్ రజనీకాంత్. ప్రముఖ సాహసయాత్రికుడు బేర్ గ్రిల్స్​తో కలిసి షూటింగ్​లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే తలైవా భుజానికి గాయాలయ్యాయి. ఇప్పుడు ఈ విషయంపై రజనీ స్పందించాడు. ముళ్లు కారణంగా తన శరీరంపై గీతలు ఏర్పడ్డాయని, ఎటువంటి గాయలు కాలేదని చెప్పాడు సూపర్​స్టార్. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు స్పష్టం చేశాడు.

'మ్యాన్ వర్సెస్ వైల్డ్​' షూటింగ్​లో సూపర్​స్టార్ రజనీకాంత్

డిస్కవరీ ఛానెల్​ వచ్చే 'మ్యాన్​ వర్సెస్​ వైల్డ్'.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో హీరో బేర్ గ్రిల్స్. గతేడాది ఇదే కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. బేర్​ గ్రిల్స్​తో కలిసి అడవుల్లో సాహసాలు చేశారు. ఇప్పుడు మోదీ తర్వాత ఇందులో కనిపించనున్న భారతదేశానికి చెందిన రెండో వ్యక్తి రజనీనే కావడం విశేషం.

Last Updated : Feb 28, 2020, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details