కరోనా ప్రభావంతో చిత్రీకరణలన్నీ రద్దయిన క్రమంలో సినీకార్మికుల కుటుంబాలకు పూట గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో తెరపై హీరోలు వారిని ఆదుకుంటూ నిజమైన హీరోలమని నిరూపించుకుంటున్నారు. కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద సినీ దర్శకులను ఆదుకోవడానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ ముందుకొచ్చారు. తమిళనాడు డైరెక్టర్స్ అసోసియేషన్‌కు 24 టన్నుల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం చేసినందుకు ఆ సంస్థ కార్యదర్శి ఆర్.కె.సెల్వమణి ఓ ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
పేద దర్శకుల కుటుంబాలకు రజనీ సాయం - తమిళనాడు డైరెక్టర్స్ అసోసియేషన్ న్యూస్
కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద దర్శకులను ఆదుకోవడానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ ముందుకొచ్చారు. తమిళనాడు డైరెక్టర్స్ అసోసియేషన్‌కు 24 టన్నుల నిత్యావసర సరుకులను అందించారు.
పేద దర్శకుల కుటుంబాలకు సూపర్‌స్టార్ సాయం
కొన్ని రోజుల క్రితం దక్షిణభారత సినీఉద్యోగుల సమాఖ్య(ఎఫ్ఈఎఫ్ఎస్ఐ)కు చెందిన కార్మిక కుటుంబాలను ఆదుకోవడానికి రూ.50 లక్షలను విరాళంగా అందించారు సూపర్‌స్టార్. మరోవైపు కరోనాపై అవగాహన కల్పించేందుకు ఇటీవలే భారతీయ సినీనటులంతా ఓ లఘుచిత్రంలో మెప్పించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సహా రజనీకాంత్ కనువిందు చేశారు.
ఇదీ చూడండి.. 'ఆయన సినిమా తీస్తే అది కచ్చితంగా కళాఖండమే'