వైద్య పరీక్షల నిమిత్తం యూఎస్‌కు వెళ్లిన సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth).. శుక్రవారం ఉదయం చెన్నై చేరుకున్నారు. పూర్తి స్థాయి చికిత్స తర్వాత ఆయన అమెరికా నుంచి చెన్నై వచ్చినట్లు తెలుస్తోంది. రజనీని చూసేందుకు చెన్నై ఎయిర్పోర్ట్ వద్ద అభిమానులు బారులు తీరారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రతి ఏటా రెండుసార్లు తన హెల్త్ చెకప్ కోసం యూఎస్ వెళ్లే రజనీకాంత్.. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏడాది కాలంలో చికిత్స కోసం అమెరికా వెళ్లలేకపోయారు. అయితే ఇటీవలే దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ తగ్గిన దృష్ట్యా యూఎస్ వెళ్లడానికి రజనీ.. కేంద్రం నుంచి అనుమతి కోరారు. వెంటనే ప్రభుత్వం అనుమతించిన వెంటనే కుటుంబసమేతంగా రజనీకాంత్ అమెరికాకు పయనమయ్యారు. అయితే 2016లో కిడ్నీ సమస్యతో బాధపడిన రజనీ.. అప్పుడు కూడా చికిత్స కోసం విదేశాలకు వెళ్లారు.