తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​ చేతుల మీదుగా 'మేజర్'​ మెలోడీ.. జోరుగా 'యశోద' షూటింగ్​ - మహేశ్ బాబు

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. అడివి శేష్ నటించిన 'మేజర్'​, సమంత 'యశోద' సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

mahesh babu
samantha

By

Published : Jan 6, 2022, 9:44 PM IST

26/11 ముంబయి దాడుల ఆధారంగా మేజర్​ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ కథతో 'మేజర్‌' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోంచి 'హృదయమా' అనే మెలోడీ గీతాన్ని జనవరి 7న ఉదయం 11.07 గంటలకు సూపర్​స్టార్​ మహేశ్ బాబు రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

'మేజర్' సాంగ్

'మేజర్​'లో టైటిల్‌ పాత్రను అడివి శేష్‌ పోషిస్తున్నారు. శశి కిరణ్‌ తిక్క దర్శకుడు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదల కానుంది.

మునుపటి తేదీకే 'సామాన్యుడు'

సంక్రాంతికే థియేటర్లలోకి వస్తానని ధీమా వ్యక్తం చేసిన 'సామాన్యుడు'.. మరికొన్ని రోజులు ఆలస్యంగా రానున్నాడు. కథానాయకుడు విశాల్ నటిస్తూ నిర్మించిన ద్విభాషా చిత్రమిది. శరవణణ్ దర్శకత్వం వహించారు. తొలుత ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయాలని భావించారు. కానీ వరుస సెలవులు కలిసిరావడం వల్ల సంక్రాంతి కానుకగా జనవరి 14న సామాన్యుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అయితే సినిమాను మరోసారి వాయిదా వేస్తూ.. మునుపటి తేదీ జనవరి 26నే విడుదల చేయాలని నిర్ణయించింది చిత్రబృందం.

'సామాన్యుడు'

'యశోద' రెండో షెడ్యూల్..

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'యశోద'. ఈ సినిమా రెండో షెడ్యూల్​ ప్రారంభమైందని తెలిపింది చిత్రబృందం. తమిళనటి వరలక్ష్మి, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

'యశోద'

శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో హరి-హరీశ్ ద్వయం దర్శకులుగా పరిచయమవుతున్నారు. మార్చి కల్లా షూటింగ్ పూర్తిచేసి వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'యశోద'ను విడుదల చేయనున్నారు.

'బ్రో డాడీ' విడుదల తేదీ..

మలయాళ స్టార్ హీరో మోహన్​లాల్, పృథ్వీరాజ్ నటిస్తున్న 'బ్రో డాడీ' విడుదల తేదీ ఖరారైంది. జనవరి 26న ఓటీటీ డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ వేదికదా రిలీజ్​ చేయనున్నారు. ఫన్​, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకిది రెండో సినిమా. అంతకుముందు మోహన్​లాల్​తోనే 'లూసిఫర్​' తెరకెక్కించారు పృథ్వీరాజ్. సూపర్​హిట్​గా నిలిచిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్​ చిరంజీవి.. 'గాడ్​ఫాదర్' పేరుతో రీమేక్​ చేస్తున్నారు.

'డీజే టిల్లు' టైటిల్ సాంగ్..

యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'డీజే టిల్లు'. అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో టైటిల్ గీతాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. రామ్‌ మిర్యాల గానం అందరినీ అలరించేలా ఉంది. ఈ సినిమాలో సిద్ధు సరసన నేహాశెట్టి సందడి చేయనుంది. ఈ వినోదాత్మక చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

'డేట్​ నైట్'​ సాంగ్ ప్రోమో..

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సోదరుడైన శిరీష్‌ తనయుడు ఆశీష్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'రౌడీబాయ్స్' (rowdy boys movie)​. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ సినిమా నుంచి 'డేట్ నైట్' అనే పాట ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. పూర్తి పాటను శుక్రవారం విడుదల చేయనున్నారు.

ఇదీ చూడండి:Ajith Kumar Valimai: కరోనా దెబ్బకు 'వలిమై' కూడా వాయిదా

ABOUT THE AUTHOR

...view details