Mahesh Babu Covid: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు కరోనా - మహేశ్‌బాబుకు కరోనా
21:07 January 06
20:49 January 06
సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు కరోనా
mahesh babu covid: సూపర్‌స్టార్ మహేశ్ బాబు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు మహేశ్.
"అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. తేలికపాటి లక్షణాలున్నాయి. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాను. నాతో సన్నిహితంగా మెలిగినవారు పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. టీకా తీసుకోనివారు వెంటనే వేయించుకోండి. దానివల్ల తీవ్ర లక్షణాలు, ఆస్పత్రి పాలవడం లాంటివి తగ్గుతాయి. కరోనా నిబంధనలు పాటించండి. జాగ్రత్తగా ఉండండి." అని ట్వీట్ చేశారు మహేశ్.
మహేశ్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు అభిమానులు. మహేశ్ నటించిన 'సర్కారు వారి పాట' చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు.