సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రానికి 'సర్కారు వారిపాట' అనే క్రేజీ టైటిల్ పెట్టారు. 'గీతగోవిందం' ఫేమ్ దర్శకుడు పరశురామ్ దీనిని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతమందించనున్నాడు.
మెడపై పచ్చబొట్టుతో మాస్ లుక్‌లో మహేశ్ - mahesh babu parasuram
సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మహేశ్ కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'సర్కారు వారిపాట' అనే పేరు పెట్టారు.
ఇందులో హీరోయిన్గా కియారా అడ్వాణీ నటించనుందని సమాచారం. దీనితో పాటే ఇతర సాంకేతిక సిబ్బంది వివరాలను మరికొన్నిరోజుల్లో వెల్లడించనున్నారు.
'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే మహేశ్ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించారు. దీని విడుదల తర్వాత కుటుంబంతో కొంతకాలంపాటు విదేశాలకు వెళ్లి వచ్చారు మహేశ్. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై తన చిన్నారులతో సరదాగా గడుపుతున్నారు. ఆయా ఫొటోలను నమ్రత ఇన్‌స్టా వేదికగా పంచుకుంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తర్వాత రాజమౌళి-మహేశ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుంది.