Pure Little Hearts Foundation: చిన్నపిల్లలకు సాయపడటంలో ఎప్పుడూ ముందుంటారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. 'మహేశ్‌బాబు ఫౌండేషన్' ద్వారా ఇప్పటివరకు వేల మంది పేద పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయించి వారికి పునర్జన్మ ప్రసాదించారు. రెయిన్బో హాస్పిటల్స్, ఆంధ్రా హాస్పిటల్స్ భాగస్వామ్యంతో గతేడాది తన స్వగ్రామమైన బుర్రిపాలెంలో ప్రజలందిరికీ ఉచితంగా కొవిడ్ టీకాలు వేయించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
తాజాగా.. మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మహేశ్. 'మహేశ్‌బాబు ఫౌండేషన్' 'రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్'(ఆర్సీహెచ్ఐ) భాగస్వామ్యంతో 'ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్(పీఎల్‌హెచ్‌ఎఫ్)ను ఆవిష్కరించారు. ఈ ఫౌండేషన్‌లో భాగంగా.. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పేద పిల్లలకు ఉచితంగా చికిత్స అందించనున్నారు.