ఆయనది తేనె మనసు. సినీ వినీలంలో అసాధ్యుడు.. అనితరసాధ్యుడు. ఆత్మవిశ్వాసమే 'వజ్రాయుధం'గా ముందుకు సాగారు. ఆయన మంచివాళ్లకు మంచివాడు.. ఊరికి మొనగాడు. అన్యాయాలు, అక్రమాలపై జ్వలించిన ఆ అగ్నిపర్వతం.. నిరుపేదల ఉజ్వల గళం. పాడిపంటలతో పుణ్యభూమి బంగారు భూమి కావాలని తపించిన కర్షకుడు.. అభిమాన లోకానికి ఆకర్షకుడు. సావాసానికైనా, సాహసానికైనా మొనగాడు. బ్లాక్‌బస్టర్ సినిమాలతో దమ్ముచూపి.. బాక్సాఫీసులో దుమ్మురేపిన కథానాయకుడు. దశాబ్దాల క్రితమే ‘సూపర్ స్టార్ డమ్’ సాధించిన అగ్రహీరో. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ.
సినీ వినీలంలో అసాధ్యుడు.. అనితరసాధ్యుడు.. సాహసాల కృష్ణ
Superstar Krishna Venditera velpulu: బ్లాక్‌బస్టర్ సినిమాలతో దమ్ముచూపి.. బాక్సాఫీసులో దుమ్మురేపిన సీనియర్ కథానాయకడు.. సూపర్‌స్టార్ కృష్ణ. దశాబ్దాల క్రితమే 'సూపర్ స్టార్ డమ్' సాధించిన అగ్రహీరో ఆయన. అయితే ఇప్పటికే ఎందరో దిగ్గజ నటుల గురించి విశేషాల్ని పంచుకున్న 'వెండితెర తెరవేల్పులు ' షో.. ఈ వారం జవవరి 9న కృష్ణ సాహసాల్ని గుర్తుచేయబోతుంది. ఈ కార్యక్రమాన్ని మీరూ చూసేయండి..
కృష్ణ గురించి, సినిమాల విషయంలో ఆయన చేసిన సాహసాల గురించి ప్రేక్షకులకి చాటిచెప్పేందుకు ‘వెండి తెర వేల్పులు’ కార్యక్రమం సిద్ధమైంది. సినీ నటుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పే షో ఇది. ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్’, ‘ఈటీవీ తెలంగాణ’లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు, సాయంత్రం 06:30 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పటికే ఎందరో దిగ్గజ నటుల గురించి విశేషాల్ని పంచుకున్న ఈ షో ఈ వారం (జవవరి 9) కృష్ణ సాహసాల్ని గుర్తుచేయబోతుంది.
ఇదీ చూడండి: సమంత 'ఊ అంటావా..' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది