తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సర్‌ప్రైజింగ్‌.. 'సరిలేరు..'లో కృష్ణ లుంగీ డ్యాన్స్‌..! - మహేశ్ బాబుతో కృష్ణ డ్యాన్స్

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాలో ప్రిన్స్ తండ్రి కృష్ణ ఓ సాంగ్​లో కనిపిస్తారని సమాచారం.

superstar
మహేశ్

By

Published : Jan 7, 2020, 1:57 PM IST

Updated : Jan 7, 2020, 6:12 PM IST

విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇటు మహేష్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు'పై.. అటు అల్లు అర్జున్‌ 'అల వైకుంఠపురములో'పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్లుగానే ఇరు చిత్ర బృందాలు అదరగొట్టే ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు సినిమాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. వీటిలో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది 'సరిలేరు..'లో సూపర్‌స్టార్‌ కృష్ణ లుంగీ డ్యాన్స్‌ అంశమే.

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో విజయశాంతి, సంగీత, బండ్ల గణేష్‌ వంటి సీనియర్‌ నటులు తెలుగు తెరపై తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఇదే చిత్రంతో మహేష్‌ తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణను కూడా తెరపైకి చూపించబోతున్నారట అనిల్‌. ‘‘ఈ సినిమాలో మహేష్‌ తండ్రిగా కృష్ణ కనిపించబోతున్నారు" అ’ని రావిపూడి ఇటీవల జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తెలిపాడు. కానీ, ఆయన ఎంట్రీ ఎలా ఉంటుంది? ఎంత సేపు ఉండబోతుంది? అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా చిత్రసీమలో వినిపిస్తున్న గుసగుసలు ప్రకారం కృష్ణ ఈ చిత్రంలో కనిపించడమే కాదు తన తనయుడితో లుంగీ డ్యాన్స్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన ‘'మైండ్‌ బ్లాక్‌' గీతంలో కృష్ణ లుంగీ పంచెతో తన తనయుడితో కలిసి స్టెప్పులేస్తారట. అయితే ఇందులో ఓ చిన్న గ్రాఫిక్స్‌ గిమ్మిక్కు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సీనియర్‌ సూపర్‌స్టార్‌ ఈ వయసులో డ్యాన్స్‌ వేయడం కష్టం కాబట్టి.. ఆయన పాత సినిమాలోని ఓ హిట్‌ గీతం క్లిప్పింగ్‌ను తీసుకుని ఇందులో మహేష్‌ పక్కన చూపించబోతున్నారట. 'యమదొంగ'లో జూ.ఎన్టీఆర్‌ పక్కన సీనియర్‌ ఎన్టీఆర్‌ను గ్రాఫిక్స్‌ చూపించనట్లుగా అన్నమాట.

ఏదేమైనా ఇన్నాళ్ల తర్వాత తండ్రీ కొడుకుల్దిరూ ఒకే తెరపై ఐటెం స్టెప్పులేస్తూ దర్శనమివ్వనుండటం సినీ ప్రియులకు ఓ స్వీట్‌ సర్‌ప్రైజ్‌ అనే చెప్పొచ్చు. మరి ఇందులో వాస్తవమెంతన్నది తెలుసుకోవాలంటే జనవరి 11 వరకు వేచి చూడక తప్పదు.

ఇవీ చూడండి.. విజయ్ 'మాస్టర్‌' ఆగమనం అప్పుడే..!

Last Updated : Jan 7, 2020, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details